Verse 1
కోటి సూర్యులకాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా
రాజాధి రాజ నీకే హల్లెలూయా మహిమ ఘనతా స్తోత్రం ||2||
ఓ...... ఓ...... ఓ...... ఓ......
Verse 2
యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి
యేసయ్య ప్రేమయే ప్రవహించె ఒరవడి
ఆనీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో
ఎక్కడ చూచిన నా ప్రియుని జాడలె ||కోటి సూర్యుల ||
Verse 3
యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం
యేసయ్య బాటలో కొండంత ఆనందం
కల్వరి కొండపై కరుణాల నాధుడు
నా కొరకు చేసిన ఆ త్యాగం గొప్పది ||కోటి సూర్యుల ||
Verse 4
యేసయ్య దర్శనమె శుభకర సుప్రభాతం
యేసయ్య సింహాసనమే సువిశాల ఆకాశం
తొలకరి వానగా - కడలిలో కెరటంలా త్వరగా
దిగిరా పరిశుద్ధ పావురమా ||కోటి సూర్యుల ||