Verse 1
జయమని పాడెదను - యేసుని ఘననామమునకు
విజయము కోరెదను - ఆ నామమునెరిగిన దీనులకు
శోధన - వేదన రోదన బాపెడి ఉన్నత నామమది
రక్షణ - స్వస్థత - విడుదలనిచ్చెడి - ఏకైక శుభనామమది -2
Verse 2
గమ్యమునెరుగక తిరిగెడి వారికి - దారిని చూపెడి నామం
దుర్మార్గులైనా శరణువేడితే - రక్షించు ఆశ్రయపురము
పరిశుద్ధ నామం - శ్రేష్ఠ నామం ||జయ ||
Verse 3
నిరాశ చెందిన వారందరిని - ఉల్లాస పరచే నామం
ఏ దిక్కులేని ఆనాధలకు - ప్రేమ రాజ్యమీ నామం
బలమిచ్చు నామం - జయమిచ్చు నామం ||జయ||జయము ||
Verse 4
జయమని పాడెదను - విజయము కోరెదను
హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ