Verse 1
శుభప్రదమైన నిరీక్షణతో - సుఖప్రద జీవన కాంక్షతో
జీవింపజేయుట నీ వశము - జీవప్రదాత స్తోత్రము
ఆ||జయము జయము జయమగుగాక నీ నామం
జయ జయ నినాదములతో నిండునుగాక ఇహ పరము || శుభప్రదమైన ||
Verse 2
శూన్యము లోనికి స్వరమును పంపి - సృష్టిని నిర్మించినావు
మట్టిని తీసి మనిషిని చేసి - మహిమాత్మతో నింపినావు
నీ వాక్కులలోని విశేషమెరిగే జ్ఞానమీయుమా
మహిమాత్మలలోని మర్మమునెరిగే మనసు నీయుమా ||జయము ||
Verse 3
పాపుల కొరకని పావనుడేసుని - పాపముగా మార్చినావు
అపజయ మెరుగని జీవము కొరకని - పునరుత్థానుని జేసినావు
ఇది కలువరిగిరిలో నీ ప్రియ తనయుని సమర్పణ
ఇది ఎవరూ ఎన్నడూ జరుపని పవిత్ర సంఘటన ||జయము ||