స్తుతి ఘన మహిమంతయు యేసుకె చెల్లించుడి
స్తుతి ఘన మహిమంతయు ఘన యేసుకె చెల్లించుడి
దూతలారా స్తుతియించుడి - దూతసైన్యమా స్తుతియించుడి
సూర్యచంద్రులారా స్తుతియించుడి - నక్షత్రములారా స్తుతియించుడి ||స్తుతి ||
పరమాకాశమా స్తుతియించుడి - ఆకాశ మండలమా స్తుతియించుడి
అగాధ జలమా స్తుతియించుడి భూమియు సమస్తమా స్తుతియించుడి ||స్తుతి ||
అగ్ని వడగండ్లు స్తుతియించుడి మంచు పెనుతుఫాను స్తుతియించుడి
పక్షులు వృక్షములు స్తుతియించుడి కొండలు లోయలు స్తుతియించుడి ||స్తుతి ||
యౌవ్వనులు కన్యలు స్తుతియించుడి - పిన్నలు పెద్దలు స్తుతియించుడి
వృద్ధులు బాలురు స్తుతియించుడి - నిత్యమేసు నామము స్తుతియించుడి ||స్తుతి ||
నాయకులు గాయకులు స్తుతియించుడి - సేవకులు విశ్వాసులు స్తుతియించుడి
సమస్త జనులారా స్తుతియించుడి - ప్రేమగల దేవుని స్తుతియించుడి ||స్తుతి ||