Verse 1
ఊహింప శక్యము కానివి - దేవుడు చేసేటి మేలులు
నాయండగ నుండి - నన్నాదరించెనేసుడు
Verse 2
తన దూతలను నాయింటి చుట్టు కావలిగా యుంచెన్
నేను నడచు వేళలందు - స్నేహితునిగా రక్షించెన్
సాతాను ఉరిలో పడకుండ నన్ను తప్పించెన్ ||ఊహింప ||
Verse 3
రక్షణయను పాత్రయును - స్తుతి ఖడ్గము నాకొసగెన్
ఆపత్కాలము నందు నాకు సహాయునిగా నిలిచెన్
రోగ శయ్య మీద నుండి నన్ను లేవనెత్తెన్ ||ఊహింప ||
Verse 4
చెరసాలలో పడియుండగా త్వరపడి విడిపించెన్
నాకు కీడు చేయగోరిన వారిని సిగ్గు పరచెన్
నా యేసుని నేను - ఎల్లపుడు స్తుతియించెదను ||ఊహింప ||