Verse 1
కోరుదును నేను, నాయేసు పాదములు - నాయేసు పాద విశేషణ వర్ణనాతీతం
Verse 2
సత్య వార్తను చాటుటకు నా - ప్రభుని పాదములు
పరుగులెత్తెను భువియందంతట - పరము చేర్చుటకు ||కోరుదును ||
Verse 3
అంధ, చెవిటి, మూగవారిని స్వస్థపరచుటకు
వారిలోపముల్ తీర్చుటకును పరుగులెత్తిన పాదముల్ ||కోరుదును ||
Verse 4
సిలువ మోయుచు కల్వరి గిరికి వెళ్ళిన పాదములు
సాతాను తల చితుక కొట్టెను సిలువ వే(మో)సిన పాదముల్ ||కోరుదును ||