Verse 1
నమ్మదగిన దేవుడా
నెమ్మదినిచ్చే యేసయ్యా (4)
నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2)
నీ తోడుంటే చాలయ్యా
భయమే నాకు లేదయ్యా (2) ||నీ తోడుంటే||
Verse 2
శ్రమ అయినా బాధ అయినా
కరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే||
Verse 3
కష్టమైనా కన్నీరైనా
కలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే||
Verse 4
సాగరాలే ఎదురు నిలిచినా
శత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే||
Verse 5
భరువైనా భారమైనా
బాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే||
Verse 6
ఎవరున్నా లేకున్నా
కలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే||