Verse 1
నా ప్రియ యేసువా నిన్ను సంధించు వేళ
మనోహరమగు నీమోమును నే గాంచు వేళ
ఎంతో ఆనందం ఎంతో ఆనందం - 2
Verse 2
నాకై గాయాలు పొందిన నీ బాహువులలో
నే చేరిమురిసి పరవశించు వేళ
నీ ఎదపైన నే వ్రాలి సేదతీరు వేళ
నా కనుల బాష్ప బిందువులు నీవు తుడుచు వేళ ||ఎంత ||
Verse 3
భువిపై నీ సేవలో పరుగిడిన పాదములు
పరమందు స్వర్ణవీధులలో నడయాడు వేళ
నా తలవంచి నీ పదమును ముద్దాడు వేళ
నా శిరమున మకుటం ధరియింప చేయువేళ ||ఎంత ||
Verse 4
ఆహా ఎంతో ఆనందం హల్లెలూయ గీతం
నే పాడే సమయం నా యేసు నీ సాన్నిధ్యం