Verse 1
మా దేవుడవు - మా మంచి దేవుడవు
మము కాచి పోషించు - మంచి కాపరి నీవు
Verse 2
మా అమ్మ ఒడి కన్నా చల్లనయ్యా నువ్వు
నాన్న భుజాల కన్నా ఎత్తయ్యా నువ్వు
బంధుబలగమును మించినవాడా
ప్రాణ స్నేహితులను అధిగమించువాడా ||మా దేవుడవు ||
Verse 3
గురువు జ్ఞానముకన్నా మిన్నయయ్యా నువ్వు
అన్యదేవతల కన్నా అత్యున్నతుడవయ్యా నువ్వు
బంధుబలగమును మించినవాడా
ప్రాణ స్నేహితులను అధిగమించువాడా ||మా దేవుడవు ||