Verse 1
యేసు నాధా రావా మా జీవనాధారావా
ఆదరించుదేవా మా ప్రేమ నాధారావా || ఏసు ||
Verse 2
ఆర్తజన రక్షకుడా ఆదియంతము నీవే
ఉన్నవాడనువాడా మా కన్నతండ్రీ రావా ||ఏసు ||
Verse 3
వాక్కు రూపము నుండి మనుజరూపము దాల్చి
కన్య గర్భము నందు ఉద్భవించినవాడా ||ఏసు ||
Verse 4
రక్తమిచ్చిన వాడా మాకై ప్రాణమిచ్చినవాడా
మృతిని గెల్చిన వాడా మా విజయమీవే రేడా ||ఏసు ||
Verse 5
పాప భారము చేత లోకము నీకు లోబడనందున
నమ్ము వారందరికి నీ రక్షణిచ్చెడివాడా ||ఏసు ||
Verse 6
బుద్ధి జ్ఞాన సంపదలు నీ యొద్దనే ఉన్నవిగా
దిద్ధి సిద్ధము చేసి బహు వృద్ధి చేసేవాడా ||ఏసు ||
Verse 7
ఆశగొను ప్రాణమును తృప్తి పరచేదేవా
వ్యాధి బాధల నుండీ మము ఆదుకొను రక్షకుడా ||ఏసు ||