ఎంత రమ్యములు యెహోవా నీ నివాసములు
ఎంత సుందరము యెహోవా నీ గుడారములు || ఎంత ||
నీ మందిరావరణం నే కోరుకున్న వరం
నీ దివ్య బలిపీఠం పిచ్చుకలకు ఆవాసం
కోయిలకు గూటి స్థలం నీదాసుల ఆశ్రయం ||ఎంత ||
నీ పాద సేవకులు ఇలలో నిరాశ్రయులు
నీ పేద పిచ్చుకలు నీ ఆలయ నివాసులు
నీ ప్రజలకు కనిపించె కోవెలలో కాపరులు ||ఎంత ||
మరణానికి సంకేతం బలి పీఠమే గదా
ఆ స్థలమే పక్షులను కాపాడే గూడు కదా
శరణార్ధులకది నిరతం స్థావరమై వెలసె గదా ||ఎంత ||
నీ మందిర నివాసులు నీ బలమొందే ప్రజలు
నిను నమ్ముకొనే జనులు నిజముగ బహు ధన్యులు
నీ గుడారమే శ్రేష్టం నీ ప్రసన్నతే క్షేమం ||ఎంత ||
నీ దర్శన సౌభాగ్యం నీ సన్నిధి సంతోషం
నా ప్రాణం ఆశించు నా హృదయం కాంక్షించు
నీ భక్తుని దృష్టించుమా అభిషిక్తుని లక్షించుమా ||ఎంత ||
నీ మందిర ద్వారమున ఒక్క రోజు గడిపిన చాలు
అవినీతి గుడారమున వేయి దినాలకన్న మేలు
నీ దాసుని దృష్టించుమా అభిషిక్తుని లక్షించుమా ||ఎంత ||