Verse 1
ఆనందం మహానందం - నా ప్రియుని స్వరము మధురం
ముఖము మనోహరం - ప్రియుని ముఖము మనోహరం
Verse 2
నశియించిన పాపిని నాకు - శాశ్వతమైన కృపజాపి
నా యేసుడెగా రక్షించెను గా - నా ప్రభువును సేవింతునుగా ||ఆనందం ||
Verse 3
వేడుకతో విందుశాలకు నన్ - తోడుకు వెళ్ళును నా ప్రియుడు
కోరిన ఫలములు తినిపించును - కూరిమితో నా ప్రియ ప్రభువు ||ఆనందం ||
Verse 4
ఆనంద భరితనై నేను - అతని నీడను కూర్చుందును
వాడబారను యేనాటికిని - వరదుని బాడుచునుండెదను ||ఆనందం ||
Verse 5
ఎంతో ప్రేమతో ప్రేమించె - వింతగ నను ప్రభు దీవించె
అంతము వరకు యేసుని చెంతనే - నుందును ఆనందముతోను ||ఆనందం ||
Verse 6
రాజగు యేసు వచ్చునుగా - రాజ్యము నాకు తెచ్చునుగా
రాజ్యమునందు నే రాణినిగా - రమ్యముగానే నుందునుగా ||ఆనందం ||