Verse 1
రక్తముకార్చి ప్రాణమునిచ్చి - ప్రేమను పంచితివా
మరణము గెలిచి పరమును చూపిన - కరుణామయుడా స్తోత్రములు
ఆకాశమునకు భూమికి నడుమ - వ్రేలాడిన మా యాజకుడా
త్వరలో మాకై రానైయున్నావా - 2 || రక్తము ||
Verse 2
నిర్ధోషివి నిష్కల్మషుడవు - పరిశుద్ధుడవు ప్రభునీవు - 2
నిరతము నీలో జీవించుటకై - కరములు చాపి సాయము చేయుము - 2
మా బలహీనత భరియించువాడ - శ్రమలన్నిటిని విడిపించువాడ - 2
కనికరమును కృప ధైర్యము నీవే - 2 ||రక్తము ||
Verse 3
సిలువలో చేసిన బలియాగముచే - నూతన మనిషిగా మార్చితివి - 2
అస్థిరముగు నా హృదయమునెంతో - నిశ్చలమతిగా మార్చితివి - 2
క్రొత్తనిబంధన చేసినవాడ - శక్తితో నను నీవు నింపుముదేవా - 2
విశ్వాసమునకు కర్తవునీవే - 2 ||రక్తము ||