Verse 1
నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే - నీవే
నా పాదాలకు దీపం - నా నావకు తీరం
నా పయనానికి గమ్యం - నీవే నీవే
నా కొండ నీవే - నా కోట నీవే - నాకన్నీ నీవేలే - యేసయ్యా - 4
Verse 2
ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే
చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే - 2
ఇమ్మానుయేలువు నీవే - మహిమాన్వితుడవు నీవే ||నాకన్నీ ||
Verse 3
కరుణతో నింపి కలుషము బాపే కర్తవు నీవే
పాప క్షమాపణ శాప విమోచన మోక్షము నీవే - 2
నిరీక్షణ నీవే - నా రక్షణ నీవే ||నాకన్నీ ||