Verse 1
ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా
హృదయాంతరంగమున
Verse 2
నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు||
Verse 3
అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి (2)
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు||
Verse 4
వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే (2)
చేరితి నీదు దారి
కోరి నడిపించుము (2) ||ప్రియ యేసు||
Verse 5
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు (2)
ఆత్మాభిషేకమునిమ్ము
ఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు||