Verse 1
యేసువైపు చూచుచూ సాగిపోదమూ
పందెమందు ఓపికతో పరుగెత్తెదము - 2
ప్రతి భారమును ప్రతి పాపమును
విడిచిపెట్టి యేసుతో కొనసాగెదము - 2 || యేసువైపు||
Verse 2
విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించు వాడును - 2
యేసువైపు చూచుచూ సాగిపోదము
అవమానము నిందను నిర్లక్ష్యపెట్టుచు
నూతన సహస్రాబ్ధిలో.... యేసు అడుగుజాడలలో - 2 ||యేసువైపు ||
Verse 3
ఎన్నడు దున్నబడని బీడు భూములన్
యేసు ప్రేమ సువార్తతో దున్నెదము - 2
కన్నీటితో వాక్యము నాటెదము
ఆత్మల పంటను కోసెదము ||నూతన ||
Verse 4
నశియించుచున్నట్టి దేవుని వారసులను
సాతాను చేతినుండి విడిపించెదము - 2
చీకటి లోయనుండి లేవనెత్తుచూ
ఆశ్చర్య వెలుగునకు నడిపించెదము ||నూతన ||