Verse 1
ఆనందమే ఆనందమే యేసుతో జీవితం
ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తుతో పయనం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నజరేయా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ గలిలేయా
Verse 2
చీకు చింత లేదు నా బ్రతుకులో - యేసే సర్వము నామదిలో
నా ప్రాణం ఈ దేహం - నా ప్రభుకే అంకితం ||ఆనందమే ||
Verse 3
దుఃఖితులకు ఆనందము - బంధితులకు విమోచనా
బలహీనులకు బలమిచ్చును ||ఆనందమే ||
Verse 4
కుంటి వారికి కాళ్ళు ఇచ్చెను - గ్రుడ్డివారికి చూపునిచ్చెను
అంధకార జీవితాలు వెలిగించెను ||ఆనందమే ||
Verse 5
అగ్నిగుండములో పడద్రోసిన - చెరసాలలో బంధించినా
శోధనలో వేదనలో ప్రభువే నా దుర్గము ||ఆనందమే ||