Verse 1
హల్లెలూయ పాటలు పాడుచుండా - కరములెత్తి స్తోత్రము చేయుచుండా
దూతలన్నీ వీణలు మీటుచుండ హాయి హాయి మనకెంతో హాయి
Verse 2
జీవవృక్ష గాలులన్నీ వీచుచుండా - జల జల జీవనదులు పారుచుండా
బంగారపు వీధులలో తిరుగుచుండ - హాయి హాయి మనకెంతో హాయి ||హల్లె ||
Verse 3
స్తుతులకు అర్హుడగు దేవుడుండా - స్తుతులతో అందరు గొల్వగ నుండా
తేజో మహిమతో మన మెగురు చుండా -హాయి హాయి మనకెంతో హాయి ||హల్లె ||
Verse 4
నీకు నాకు ఫలంబులన్నీ ప్రభునందుండా-ఎవరికి వారికి తగినట్లుగా కిరీటంబులుండా
పరమునందు ప్రభుకాంతి వెలుగుచుండా-హాయి హాయి మనకెంతో హాయి ||హల్లె ||