Verse 1
తృష్ణ గొనుచున్నది నా ప్రాణము ఆశపడుచున్నది నీ కోసము
నీ జీవ జలపు ఊటతో తృప్తి పరచుము దేవా
Verse 2
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు
నీవుండగా ఈలోకమే నాకక్కరలేదు నాకక్కరలేదు ||తృష్ణ ||
Verse 3
దుప్పి నీటి వాగు కొరకు ఆశపడు రీతిగా
నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఆశపడుచున్నది ||తృష్ణ ||
Verse 4
నీవు చేసిన మేలులను నేను మరువలేనయ్య
నా జీవితం నీ సేవకే అర్పించితినయ్య అర్పించితినయ్యా ||తృష్ణ ||