Verse 1
పాడెదం హల్లెలూయ - క్రొత్త పాట పాడెదం
ప్రభు మంచివాడు మంచి చేయువాడు
సర్వశక్తిమంతుడు - ఆయనాశ్చర్యకరుడే
Verse 2
సర్వజనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియించుడి
స్వరమండలం మేళతాళములతో ప్రభువును స్తుతియించుడి
ఆయన మనలను సృజియించెనే - ఆయనను ధ్యానింతుము ||పాడెదం ||
Verse 3
మంచి దేవుని కృప మన ఎడల నిరంతరము నుండును
ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును
దినములు ఘడియలు మారినను - మారనివాడు మన యేసు ||పాడెదం ||
Verse 4
అబ్బా తండ్రి! అని ప్రభువును పిలిచే భాగ్యము మనకిచ్చెనే
తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్
మన పాపములను క్షమియించి - పరిశుద్ధులనుగా చేసెనుగా ||పాడెదం ||