నీతో పోల్చుటకు సర్వేశా - ఎవరును లేరు ప్రకాశా
స్తుతి పాడుటకు యేసునాధా - చాలవు పదివేల నాలుకలు
నిజముగా యేసు పరిశుద్ధుడు - పరమ దేవుని చూచుటకు
స్తుతులతోను కవిత్వముతో - దేవదేవుని చేరెదము ||నీతో ||
చేతి పటములు రాళ్ళు మన్ను - మనకు దైవములు కానేరవు
ఆత్మతోను సత్యముతో - ఆరాధింతుము మనదేవుని ||నీతో ||
నశించును వెండి బంగారముల్ - లోక మాయలు గతించును
విలువైనది స్థిరమైనది - యేసు నాధుని కృపావరమే ||నీతో ||
దైవసుతుడుగ అవతరించెన్ - పాప శోధనలు తొలగించెన్
నరులకై జీవమిచ్చె - నశించు జనులను రక్షించెన్ ||నీతో ||
పొంగుచుండిన అలలను - త్రొక్కునటువంటి ప్రభువు
అణిగిపోవున్ గద్దించగనే - అద్దరి మనము చేరుటకు ||నీతో ||
జీవమిచ్చి లేచెను ప్రభువు - జీవ దేవుడు విజయుడయ్యెన్
యేసు ప్రభువు తిరిగి వచ్చున్ - సమీపించును ఆ శుభదినము ||నీతో ||