Verse 1
జీవితమన్నది నీటి బుడగరా - ఏదో ఒకనాడది పగిలిపోవురా
ఆశల ఆరాటములో పోరాటమురా - బంధాల సందడిలో బంధీవిరా
ఎందుకు ప్రయాస ఓ సోదరా - 2
ముందే యేసుకు హృదయం అర్పించరా || జీవిత ||
Verse 2
మేడల యజమానుడవైనా - వాడవాడలా ఖ్యాతి మారుమ్రోగినా - 2
కీడు పొంచియున్న పాము లోకము - 2
తోడురాదు గోడు వినదు - మోసపోకు నేస్తమా - 2 ||ఎందుకు ||
Verse 3
నీ సాధన శోధనగా - మారినప్పుడు
ఆశలే నిరాశలై పోయినప్పుడు - 2
సుఖాలన్ని నీకు అసహ్యమైనప్పుడు - 2
క్రీస్తు ఇచ్చు శాంతిని గుర్తించలేనప్పుడు - 2 ||ఎందుకు ||