Verse 1
నా జీవిత రధసారధి నీవే - జీవనదాతా యేసుప్రభు
అభయము నీవే - నా విజయము నీవే - 2
భవితవ్యానికి గమ్యమునీవే - భవితవ్యానికి గమ్యమునీవే
Verse 2
సృజియించి పోషించి నీ సన్నిధికి ఆకర్షించి - ప్రేమతో సంధించి కృపలో బంధించి
రక్షణవస్త్రము నాకందించి - 2
పరిశుద్ధ అడుగులు నేర్పించి - నీ పరిచర్యకై
అభిషేకించి - అభిషేకించి ||నా జీవిత ||
Verse 3
ఈయాత్రలో ఎదురైన గాయాలు - హృదయము నెంతో కృంగజేసినా
హస్తమునందించి ఆదరణచూపించి - 2
కన్నీరుతుడిచి నను కౌగలించి - నా ప్రియమైన దాసుడవనుచు
నూతన శక్తితో నింపిన దేవా - నింపిన దేవా ||నా జీవిత ||