Verse 1
ప్రకటింతును నీ ప్రేమగాధ - పరిశుద్ధుడా నీ సాక్ష్షిగా
ప్రార్ధింతునూ పగలురేయి - ప్రభు నీసన్నిధి తోడురాగా || ప్రకటింతును||
Verse 2
నా ప్రాణమా నీకేల భయము - నా జీవమా నీకేల తొందర - 2
రక్షణకర్తను ధ్యానించుచూ - సత్య సంకీర్తన పాడుచూ - 2 ||ప్రకటింతును ||
Verse 3
చిరకాలము దీవించువాడని - కలకాలము కాపాడు రాజని - 2
బుద్ధియు జ్ఞానము సంపదలు - సమృద్ధిగానిచ్చు దివ్య తేజుని - 2 ||ప్రక ||
Verse 4
ఈ కాలమందు దయచేయబడిన - స్థిరమైన దేవుని ఆశీర్వాదము - 2
రక్షణ బాహుళ్యము - నిత్యము నిచ్చును ఐశ్వర్యము - 2 ||ప్రకటింతును ||