Verse 1
ఉప్పొంగిన హృదయము - అర్పించే అంజలిదే
స్వీకరించు శ్రీకరా - స్తుతుల చిన్న కాన్కలను
మదనిసా - నిసగసా - గమదనీ - సగసనీ
సనిద నిదమ దమగ - మగస - సగమగమద మదని దనిస
సస గగ మమ గగ మమ దద - మమ దదనిని మమ దదనిని
Verse 2
నీవెకదా సర్వ సృష్టి - నీకవసరమేమున్నది
మా జీవిత భాగ్యములు - మాకిచ్చితి సకలములు
అర్పింతును అందుకో - అమరుడ నీసేవకే ||ఉప్పొంగిన ||
Verse 3
తనువు తలపు మనసు స్వేచ్ఛ - నీ విచ్చిన వరములుగ
చేకొని దీవించు దేవా - నీ చిత్తము పాటించగ
పాలించుము ప్రేమతో - నీ ప్రార్థన చేసెద ||ఉప్పొంగిన ||
Verse 4
అధముడను అల్పుడను - ఇంతకన్న యివ్వలేను
రొట్టె ద్రాక్ష రసములను - అమరముగ చేయినీవు
అనవరతము సేవకే - నీ ప్రార్థన చేసెద ||ఉప్పొంగిన ||