Verse 1
సిలువ ప్రేమ నాకునేర్పెనే విలువైన త్యాగము
కలువరిలో నాకు చూపెనే పరలోక మార్గము - 2
Verse 2
అవమానము అపహాస్యము నాకొరకు పొందుచూ
బలియాయె నాదు పాపములకై నాధు డేసుడే - 2
క్రయధనముగా తనప్రాణమిచ్చె త్యాగశీలియై - 2
నామదిలో నున్న కరడునంతా కడిగివేసెనే ||సిలువ ||
Verse 3
సుకుమారుడు సురూపితా కురూపి ఆయెనే
నేనే ఆయనంచుబల్కి అప్పగించుకునెన్ - 2
ఇంతగా నాకొరకు ప్రభూ చింతనొందగా - 2
ఎంతగా సేవించినా నావంతు తీరదే ||సిలువ ||