Verse 1
క్రైస్తవమా యువతరమా - ప్రభునియందే నిలువుమా
స్థిరముగా నిలువుమా - ప్రభుని యందే నిలువుమా || క్రైస్తవమా ||
Verse 2
ద్రాక్షవల్లిలోని తీగెను పోలి - దీక్షతో ప్రభు జీవము గోరి
ప్రభుని కృపలో బలము పొంది
సేవ చేయగరా - ఫలము పొందగరా ||క్రైస్తవమా ||
Verse 3
బండపైన - పునాదిని వేసి
అండయైన యేసుని చేరి - దండిగా ప్రభునాత్మ కలిగి
నిండు మనస్సుతో రా - ముందుకు సాగుమురా ||క్రైస్తవమా ||
Verse 4
క్రీస్తులోని స్వాతంత్య్రముతో - పాపదాస్యపు కాడిని విరచి
కృపలో నిలచి - ఖలుని గెలిచి
బలము పొందుమురా - జయము నీదేరా ||క్రైస్తవమా ||