Verse 1
ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటునా నన్ను దాచెను - 2
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను
యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును
నా చెయ్యి విడువని దేవుడు ఉండగా నేను భయపడను - 2
ఆ........ హల్లెలూయా ఆఆ......... హల్లెలూయా
Verse 2
ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు నన్ను ఎత్తుకునే దేవుడవు
నీవు కాక వేరే ఆశ నాకు లేనేలేదు
నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదను
ఆ..... హల్లెలూయా........ ఆ.... ఆ.... ఆ..... హల్లెలూయా - 3
Verse 3
లెక్కింపలేని అద్భుతములు మక్కువతో చేసినదేవా
నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును
స్వచ్ఛమైన నిత్యప్రేమను నాపై చూపిన దేవుడవు
కోట్లకొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా
ఆ.... హల్లెలూయా........ - 3 ఆ...... హల్లెలూయా