Verse 1
పాపము బహుశాపము - మామీదికి తెచ్చును
వేదనై బహుభారమై - పాదములను తొట్రిల్లజేయును - 2
Verse 2
సత్ స్థితిలో ఉంటిమని - రుగ్మతిని కల్గియుండీ
దుస్థితిలో నాశనమై - నీకుదూరమైన ప్రజలను - 2
లోపలనున్నట్లు నటించుచూ(భ్రమించుచూ) - వెలుపల నిలిచిన హృదయాలను -2
మేల్కొలిపే స్థిరపరచే - నూతన జీవమిమ్ము ఓ ప్రభూ ||పాపము ||
Verse 3
సంద్రములో నీప్రజలన్ - పాదము తడవకనడిపించిన
ఆ రీతిగనే మమ్ములను - పాపము అంటకనడిపించుము - 2
ఆజ్ఞను దీపముగా పొందెడి - విలువగు చోటున మము దాచుము - 2
హృదిలో భారముతో అన్యుల రక్షణకై ప్రార్థన చేయనేర్పుము ||పాపము ||
Verse 4
పాపులను మార్చుటకు - సత్యము చాటింపజేయుము
నెమ్మదిలో నిలుచుటకు - స్థిరహృదయము కలుగజేయుము