Verse 1
తరతరములకు నీవే దేవుడవు
యుగయుగములకు నీవే నాధుడవు
ప్రేమను పంచిన ప్రేమ స్వరూపుడవు
నిత్య జీవము నిచ్చిన సత్యస్వరూపుడవు
మహిమతో నింపుమా
ధన్యులన్ చేయుమా
మహిమను చూపుమా
అక్కున చేర్చుమా
Verse 2
తృణీకరింపబడిన నా బ్రతుకులో వెలుగును నింపగా
శాశ్వత శోభాతిశయముగా నన్ను మార్చగా ||మహిమతో ||
Verse 3
బహుతరముల వరకు సంతోషకరమైన స్వాస్థ్యమునివ్వగా
తరతరముల వెంబడి దీవెనలు పంచగా ||మహిమతో ||