స్తోత్రించెదము స్తోత్రించెదము - యేసు దేవుడా
మా జీవనాధా ప్రేమనాధా - స్తోత్రించెదము
ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని
ఏడు దీపంబులమధ్య - సంచరించు వాడా ||స్తోత్రించెద ||
మొదటివాడా కడపటివాడా - మది నిను దలచెదను
మృతిని గెల్చి లేచినవాడా - మది నిను దలచెదను ||స్తోత్రించెద ||
వాడియైన రెండంచుల - ఖడ్గము గలవాడ
పాడినిన్ను భజియించెదము పరమ పురవాస ||స్తోత్రించెద ||
అగ్నిజ్వాలలవంటి కన్నులు - కలిగిన వాడా
అపరంజిని బోలిన పాదము దేవుని కుమారా ||స్తోత్రించెద ||
ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలును
కలిగినవాడా కరుణించి మము - కాపాడు మయా ||స్తోత్రించెద ||
దావీదు తాళపు చెవిని - బడసిన వాడా
సత్యస్వరూపి పరిశుద్ధుడా - సంఘములకు కర్తా ||స్తోత్రించెద ||
ఆమేన్ అనువాడా - నమ్మకమైన నాధుడా
సత్యసాక్షి దేవుని సృష్టికి - ఆదియు నీవేగా ||స్తోత్రించెద ||