Verse 1
ఓ నీలిమేఘమా - నీకైనా తెలుసునా
ఎప్పుడో నా ప్రభు రాకడ - ఇలలో నా పోకడ
భువిలో నా జీవితాకడ
వేచి వేచి ఉన్నాను యేసయ్య రాకకై
ఆశతోడ ఉన్నాను నా ప్రభు కడబూరకై
మేఘమా.... నీలి మేఘమా.... || ఓ నీలిమేఘమా ||
Verse 2
మధ్యాకాశములో వేవేల దూతలతో
నా ప్రియుడేతెంచును - 2
ఎదుర్కొందును ప్రభుని కలుసుకొందును - 2
ఈ పెండ్లి కుమారుని వధువునై వరించెదను ||వేచి వేచి ||
Verse 3
పండ్రెండు ముత్యముల పరమపురి గుమ్మములో
ప్రియముగ ప్రవేశింతును - 2
గొర్రెపిల్లయే దీపం మహిమ దాని ప్రకాశం - 2
సువర్ణమైన వీధులు చూడాలను కాంక్షతో ||వేచి వేచి ||