నీ నిమిత్తము నిర్మించబడితిమి - నీ స్తోత్రమును ప్రచురపరతుము
నీ మహిమ నిమిత్తం సృజించబడితిమి - నిన్ను ఆరాధించు ప్రజలము (మేము)
నీ మందగ చేసితివి నీవే సమకూర్చితివి
మా ముందు నడిచే మా మంచి కాపరివి
పచ్చిక బయళ్ళలో పరుండజేయుచూ
స్వచ్ఛమైన జలములతో తృప్తిపరచుచూ
మా ప్రాణములకు సేద దీర్చుచుంటివే
నీ నీతి మార్గములలో నడుపుచుంటివే ||హల్లేలూయ ||
నీ స్వరక్తమిచ్చి కొన్న నీ స్వాస్థ్యము మేము
నీ రుధిరమందు కడిగి పరిశుద్ధ పరచితివి
రక్షణ వస్త్రములు ధరించుకొంటిమి
రాజులైన యాజక సమూహమైతిమి
శిరస్సైన క్రీస్తుకు శరీరమైతిమి
సంఘవరుడు క్రీస్తుకు వధువైతిమి ||హల్లేలూయ ||
మా ఊటలన్నియూ నీ యందే ఉన్నవి
నీ పేటు బీటలను మేమాశ్రయించితిమి
మా దాగు చోటువై కాచుచుంటివే
నీ మాటలే మా జీవిత బాటలాయెనే
మా నోట అవి క్రొత్త పాటలాయెనే ||హల్లేలూయ ||
క్రీస్తుతో లోకమును సమాధానపరచే
క్రీస్తు పక్షమందున రాయబారులైతిమి
సర్వలోకమందు నీకు సాక్షులైతిమి
నీ మహిమను చాటే పత్రికలమైతిమి
లోకమునకు వెలుగుగా చేసిన దేవా
(మమ్ము) లోకమునకు ఉప్పుగామార్చిన దేవా ||హల్లేలూయ ||
హల్లెలూయ, హల్లెలూయ, హల్లేలూయ - 2
ఆరాధించి స్తోత్రించి - కృతజ్ఞతలు అర్పించి
మ్రొక్కి భజియించి - నిను పూజింతుము