Verse 1
దేవుడే తోడుగా సాగిపోదును - నా జీవితమును ఆయనకై
నిలుపు కొందును - నే నిలచియుందును
Verse 2
తృణప్రాయపు ఈ బ్రతుకున - తరుణోపాయము కనుగొన
తరుణమిదియె కలిగెనాకు - త్రోవనేడే దొరికెనాకు ||దేవుడే ||
Verse 3
కఠినమైన నా హృదయపు - కలుషములను బాపుకొనను
కరుణ నాలో ప్రవహింపగ - కాంతి నేడే ఉదయించగా ||దేవుడే ||
Verse 4
వీగిపోవు నా హృదయము - ఆగిపోవు ఏ క్షణమునో
సాగిపోదు నిన్ను చూచి - దాగియుందు నీ నీడలో ||దేవుడే ||