Verse 1
ఇది యెహోవా చేసిన కార్యం - మనమంతా ఉత్సహించెదం
ఇది ప్రభువేర్పరచిన శుభదినం - మనకన్నులకెంతో ఆశ్చర్యం
మన హృదయాలకెంతో ఆనందం || ఇది ||
Verse 2
ఆది నరుడు ఆదాముకు సాటియైన సహాయమును
చేయుదునని యోచించెను గాఢనిద్ర కలిగించెను - 2
ప్రక్కటెముకతో స్త్రీని నిర్మించి అతని యొద్దకు కొనితెచ్చెను
వారిరువురిని జతపర్చెను ||ఇది ||
Verse 3
నా యెముకలలో ఒక యెముక నామాంసములో మాంసము
నాలోనుండి తీయబడినది నారీ యనబడును
తల్లి దండ్రులను విడిచి పురుషుడు భార్యను చేపట్టును
ఇక ప్రభువే నడిపించును ||ఇది ||