Verse 1
ఈలోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు
ఈజీవం కాదు కాదు - శాశ్వతము అసలు కాదు
ఈ తనువు మంటికి మన్నై - పోవునెపుడో తెలుసుకో
Verse 2
ఈ ధనము ఘనము మాయ - ఈ చదువు పదవి మాయ
నీకున్నవి అన్నీ క్షయము - ప్రభుయేసే అక్షయము ||ఈలోకం ||
Verse 3
ఈ అందం చందము మాయ - ఈ దేహం ప్రాణము మాయ
బాంధవ్యం అన్నీ క్షయము - ప్రభుయేసే అక్షయము ||ఈలోకం ||
Verse 4
ప్రభుయేసే నిత్యజీవం - ప్రభురాజ్యం నీదు గమ్యం
ప్రతిక్షణము కోరుమేసునే - పరమార్ధం తెలుసుకో ||ఈలోకం ||
Verse 5
ఈ భోగం, అహము మాయ - ఈ కీర్తి ఖ్యాతియు మాయ
నీకున్నవి అన్ని వదలి - ప్రభుయేసుకై కదలిరా ||ఈలోకం ||