Verse 1
నూతన యెరూషలేము పట్టణము
పెండ్లికై అలంకరింపబడుచున్నది || నూతన ||
Verse 2
దైవ నివాసము మనుష్యులతో కూడ ఉన్నది
వారాయనకు ప్రజలైయుందురు
ఆనంద మానంద మానందమే ||నూతన ||
Verse 3
ఆదియు నేనే అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు మరణము లేదు ||ఆనంద ||
Verse 4
అసహ్యమైనదీ నిషిద్ధమైనదీ చేయువారు
ఎవ్వరు దానిలో లేనేలేరు ||ఆనంద ||
Verse 5
దప్పిగొను వారి దహము తీర్చునటులగ
జీవజలముల బుగ్గయు గలదు ||ఆనంద ||
Verse 6
జనములను స్వస్థపరచుటకై వినియోగించు
జీవ వృక్షము యొక్క ఆకులు గలవు ||ఆనంద ||
Verse 7
దేవుని దాసులు ఆయనను సేవించుచు
ముఖదర్శనము చేయుచునుందురు ||ఆనంద ||
Verse 8
సీయోనులో గొఱ్ఱెపిల్లయె మూలరాయి
సియోన్ పర్వతం మీదయు ఆయనే ||ఆనంద ||