Verse 1
ఇంత గొప్ప సాక్షి సమూహము - మేఘమువలె ఆవరించియుండగ
మనమందరము ప్రతి భారము - సుళువుగ చిక్కులిడే పాపము
విడచి క్రీస్తుతో కూడి సాగెదము
Verse 2
పిలిచిన పిలుపుకు - చాలిన జీవితం
కలిగిన తొలగును - ప్రతి ఆటంకం
వలయము - విలయము - ప్రళయము ఎడబాపవు క్రీస్తు ప్రేమను ||ఇంత ||
Verse 3
అర్పణ కంటే వినయము శ్రేష్టము
ప్రాణము వీడువరకు - క్రీస్తు చూపెను
కలువరి శ్రమయే మేలని యేసు కొరకు యాగమౌదము ||ఇంత ||
Verse 4
జీవము కంటే కృపయే ఉత్తమం
కృప చూపించు యేసు నామమద్భుతం
కరములు పరముకు చాపుచు కీర్తించెద మధిక శక్తితో ||ఇంత ||