Verse 1
ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము (2)
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ॥ఈ మరణము॥
Verse 2
జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2)
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2)
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ॥ఈ మరణము॥
Verse 3
యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు (2)
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో (2)
కొలువు తీరెదరు పరలోకంలో ॥ఈ మరణము॥
Verse 4
కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును (2)
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును (2)
గతకాల సంగతులు గతించి పోవును ॥ఈ మరణము॥