Verse 1
ముక్తికి ఆధారమైన భక్తి
సత్య దేవునితో చేయుటయే యుక్తి
ఆసక్తితో కలుగునెంతో శక్తీ - 2
ఆ మార్గమందే నడిచిన పొందెదము మోక్షప్రాప్తి
Verse 2
సంతానము హతులైపోయే - సంపదలు హరించిపోయే
తనువంతా కృషించిపోయే - తన వారే శోధించినారే
దేవునితో సహవాసములో శ్రమలైనా మహాభాగ్యమని
రెట్టింపు దీవెనలెన్నో పొందిన గొప్ప భక్తుని చరితముగనుమా ||సంతుష్టి ||
Verse 3
బెత్తములతో దెబ్బలనోర్చే - మితిలేని కష్టములోర్చె
కానలలో ఆపదలోర్చె - ఆకలిని దప్పికలోర్చె
సువార్తకై శ్రమలొందుటలో - చావైన లాభమేనని
నీతికిరీటపు బహుమతి పొందిన - గొప్ప భక్తుని చరితము గనుమా ||సంతుష్టి ||
Verse 4
సంతుష్టిసహిత భక్తి - గొప్పలాభము నందించు శక్తి
మనపితరులు పొందెను ముక్తి - స్వరమెత్తిపాడెదం స్తోత్రగీతి