Verse 1
కర్షకుడా ఓ కర్షకుడా వర్షము లేదురా
వర్షము లేకయే సేద్యము ఆగెనురా
మత్తును వీడు ప్రభువును వేడు ||కర్షకుడా||
Verse 2
యేసే జగతికి జీవజల ఊటరా - క్రీస్తునందు నీవే జీవజల నదివిరా
అడ్డులను ఆణగద్రొక్కుమురా - నదివలే పొర్లి పారుమురా ||కర్షకుడా ||
Verse 3
నీ తల జలమయము కావాలిరా
నీ కన్నులే ఊటగ మారాలిరా
నీ కన్నీటితో పొలమును తడుపుమురా
నీవే సమృద్ధి పంటను కూర్చుమురా