Verse 1
జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం
జీవింప చేసిన రాజా నిన్నే
జీవితమంతా స్తుతింతున్ (2)
హల్లెలూయా హల్లెలూయా పాడెదన్
ఆనంద ధ్వనితో ఆర్భాటింతును (2)
Verse 2
నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో (2)
నీవే నా బలం... దేనికి జడియను (2) ||జయమిచ్చిన||
Verse 3
నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు (2)
కరుణా మూర్తివి... యేసు నా రక్షకా (2) ||జయమిచ్చిన||
Verse 4
అద్భుతకరుడవు సృష్టికర్తవు (2)
యుద్ధ శూరుడా... విజయ శీలుడా (2) ||జయమిచ్చిన||
Verse 5
సత్య దేవుడు కరుణా శీలుడు (2)
నన్ను కాచును... కునుకడు ఎన్నడూ (2) ||జయమిచ్చిన||
Verse 6
యేసే నా రక్షణ నాదు ఆశ్రయం (2)
నా నిరీక్షణ... యేసు నాయకుడే (2) ||జయమిచ్చిన||