Verse 1
రమ్మను చున్నాడేసు ప్రభు - రయమున రారండి
పిలుచుచున్నాడు ప్రియమార - ముదమున రారండి
Verse 2
ప్రయాసపడి భారంమోసి - పరితాపమొందువారికి
యేసే విశ్రాంతి మూలం - యేసే చిరజీవనం ||రమ్మను ||
Verse 3
నీతి పరిశుద్ధతకై - దాహముగొన్నవారికి
జీవజలము తానై - ఆత్మానంద మిచ్చును ||రమ్మను ||
Verse 4
పాపపు దాస్యమునందు - వేసారిన వారికి
విడుదలనిచ్చు యేసు - తానే నడిపించును ||రమ్మను ||
Verse 5
భయంకర పాపమునందు - భ్రమతో నిలిచెదవా
పాపము విడిచి యేసు - శాంతినే మదికోరవా ||రమ్మను ||
Verse 6
అనుకూల సమయమునందు - నీ మొఱనాలకించును
రక్షణదినమిదియే - తక్షణం ప్రార్థించుము ||రమ్మను ||