Verse 1
సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)
ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)
Verse 2
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥
Verse 3
నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥
Verse 4
నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు
జయజీవితము ఇచ్చినావు (2) ॥సర్వోన్నతుడా॥