Verse 1
సిలువలో నాకై చేసిన యాగము
మరువలేనయ్యా మరచిపోనయ్యా
నీ ప్రేమను... నీ త్యాగము...
Verse 2
మరువలేనయ్యా నీ ప్రేమను
మరచిపోనయ్యా నీ త్యాగము (2)
సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా||
Verse 3
నా కోసమే నీవు జన్మించితివి
నా కోసమే నీవు సిలువనెక్కితివి (2)
నా కోసమే నీవు మరణించితివి (2)
నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా||
Verse 4
ఎవరూ చూపని ప్రేమను చూపి
ఎవరూ చేయని త్యాగము చేసి (2)
విడువను ఎడబాయను అన్నావు (2)
నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||