Verse 1
సిద్ధపడుదాం సిద్ధపడుదాం - మన దేవుని సన్నిధికై
సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం - మన హృదయము ప్రభుకొరకై
సిద్ధమనసను జోడు తొడిగి - సమాధాన సువార్త చాటుదాం ||2|| ||సిద్ధ||
Verse 2
ప్రతి ఉదయమున ప్రార్థనతో - నీ సన్నిధికి సిద్ధమౌదుము
జీవం గలిగిన వాక్కులకై - నీ సన్నిధిలో వేచి యుందుము
సిద్ధమనసను జోడు తొడిగి - సమాధాన సువార్తను చాటుదాం ||సిద్ధ ||
Verse 3
సత్కార్యముకై సిద్ధపడి - పరిశుద్ధతతో నుందును
అన్ని వేళల యందు ప్రభు యేసును ఘనపరచి కీర్తింతును
సిద్ధమనసను జోడు తొడిగి - సమాధాన సువార్తను చాటుదాం ||సిద్ధ ||
Verse 4
బుద్ధిని కలిగి నీ రాకడకై - మెలకువగా నేనుందును
నీ రాజ్య సువార్తను ప్రకటించు - ప్రతివారిని సిద్ధపరతును
సిద్ధమనసను జోడు తొడిగి - సమాధాన సువార్తను చాటుదాం ||సిద్ధ ||