Verse 1
ఆత్మతో వేడనా ఆనందించి పాడనా - ఆత్మనాధ మా యేసయ్యా
అనుభవించి పాడనా - అనుదినం పాడనా
అన్నివేళలందు కాయు దైవమా... ఆధారమా
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
Verse 2
వత్సరములు గడుచుచుండగా - నీ కార్యము నూతనపరచుము
దర్శనమును విస్తరింపజేయుము - ధన్యులజేయ దివ్యవరములను
దండిగా కుమ్మరింపజేయుము - 2 ||హల్లెలూయా ||
Verse 3
పర్వతములపై నిలువ సుందరమగు పాదములిచ్చిన
సర్వశక్తుడా నీకు స్తోత్రము - విశ్వమంత నీ వెలుగును పంచే
దివ్వెలుగా వెలుగొందజేయుము - 2 ||హల్లెలూయా ||
Verse 4
రాజులైన యాజకులనుగా నుండుటకై మమ్మునుపిలిచిన
నీతి సూర్యుడా నీకు స్తోత్రము - సహనముతో నీ సంఘమును కాచే
దీనులుగా మమ్మును మార్చుము - 2 ||హల్లెలూయా ||