Verse 1
భువిపై భారత బంగరు బాలలం
దివిలో దేవుని రాజ్యవారసులం
మసకబారిన మనసులలో - వెలుగులు నింపే కిరణాలం
బీటలువారిన భూములపై - వర్షింపజేయు పవనాలం ( 2 )
Verse 2
కులం లేదు మతం కాదు - మార్గం మన యేసయ్యే
కలిసిమెలిసి నడిచిపోతే - చేరే దేశం పరలోకం
ఆకలి దాహం లేదంట - చావు దుఃఖం రాదంట
ఎంతో చల్లని రాజ్యం - అది ఎంతో చక్కని దేశం ||భువిపై ||
Verse 3
పసివారల ప్రతిహృదిలో - వాక్య విత్తనాలు చల్లి
పరలోకపు పౌరులుగా - ప్రభువుముందు ప్రణమిల్లి
భాషాభేదం లేకుండా - ప్రాంతీయ ద్వేషం రాకుండా
చేయి చేయి కలుపుదాం - మదిని గుడిగ నిలుపుదాం ||భువిపై భారత ||