Verse 1
గురిలేని జీవితనావ దరిజేరుటెన్నడో జీవా
ప్రభుయేసునందే నీకు త్రోవ - పరలోక రాజ్యం చేరుకోవా
Verse 2
మారుమనస్సు పొందాలి నువ్వు - అప్పుడేనీకు సిసలైన నవ్వు
నీదు హృదయం యేసయ్యకివ్వు - తిరుగులేని పరిశుద్ధుడవవ్వు ||గురి ||
Verse 3
కాలాతీతం కావచ్చిందయ్యో - కాలదోషం పట్టియున్నది
రానురాను బ్రతుకుభారము - తీరంచేరేదారి వెతుకుము ||గురి ||
Verse 4
ఇంటిలోన పాపభయము - లోకమంతా యుద్ధభయము
కంటినిండా నిదురలేదు - ఎందుకింకా ఆశవీడు ||గురి ||
Verse 5
ఇంటినిండా జనములున్నా - ఒక్కడైనా వెంటరాడు
ఒంటరివైనా భయములేదు - మింటనున్న ప్రభుని చూడు ||గురి ||