Verse 1
ఆకాశము కన్న ఎత్తైనది నా యేసయ్య ప్రేమ
సముద్రము కన్న లోతైనది నా యేసయ్య మనస్సు ||2||
మనలను ప్రేమించినాడు మనలను క్షమియించినాడు ||2||
Verse 2
సృష్టిని నీకోసం చేసినాడు ఆయన రూపం నీకిచ్చినాడు
ఆశీర్వదించి సమృద్ధి నిచ్చినాడు - భూమిని ఏలమని చెప్పినాడు ||మన ||
Verse 3
దివి నుండి భువికి వచ్చినాడు సిలువలో మనకై మరణించి
పాపములు క్షమించి రక్షించినాడు - నిత్య జీవము నీకు ఇచ్చాడు ||మన ||